TS News: తెలంగాణలో మరోసారి అయ్యర్‌ కమిటీ పర్యటన.. ఇంజినీర్లతో భేటీ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటిస్తోంది.

Published : 20 Mar 2024 17:18 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో మరో దఫా పర్యటిస్తోంది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంది. మూడు ఆనకట్టల బాధ్యతలు నిర్వహించిన ఇంజినీర్లతో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో సమావేశమైంది.

గత పర్యటనలో క్షేత్రస్థాయిలో ఆనకట్టలను పరిశీలించిన కమిటీ.. కొంత మంది ఇంజినీర్లతోనూ సమావేశమైంది. ఆనకట్టల డిజైన్స్, ప్లానింగ్‌, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ తదితర వివరాలు తీసుకొంది. గత పర్యటనకు కొనసాగింపుగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈఎన్సీ జనరల్, హైడ్రాలజీ, సెంట్రల్‌ డిజైన్స్‌ విభాగాలతో సమావేశం కానుంది. ఇంజినీర్లతో విడివిడిగా భేటీ కానున్న కమిటీ.. పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన వారినీ హాజరు కావాలని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని