Sattenapally: తాయిలాలకు తెరలేపిన వైకాపా.. సత్తెనపల్లిలో చీరలు స్వాధీనం

ఓటర్లను ఆకర్షించేందుకు వైకాపా నాయకులు తాయిలాలకు తెరలేపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు దాదాపు 2వేల చీరలు స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Mar 2024 18:09 IST

సత్తెనపల్లి: ఓటర్లను ఆకర్షించేందుకు వైకాపా నాయకులు తాయిలాలకు తెరలేపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు దాదాపు 2వేల చీరలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు విజయభాస్కర్‌రెడ్డికి చెందిన కేవీఆర్‌ మార్టులో ఓటర్లకు పంచేందుకు చీరలు సిద్ధంగా ఉంచారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలికి చేరుకుని చీరలు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న తెదేపా నాయకులతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని