కోలుకుంటున్న వారే అధికం!

భారత్‌లో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు సంఖ్య రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. శనివారం ఒక్కరోజే 33,136 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 93,57,464కు చేరింది.........

Updated : 13 Dec 2020 10:28 IST

15 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దిల్లీ: భారత్‌లో నమోదవుతున్న కరోనా కొత్త కేసులు సంఖ్య రోజురోజుకీ తగ్గుముఖం పడుతోంది. శనివారం ఒక్కరోజే 33,136 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 93,57,464కు చేరింది. దీంతో రికవరీ రేటు 94.93 శాతానికి చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 10,14,434 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,254 మందికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029కి చేరింది.

మరోవైపు, గడిచిన 24 గంటల్లో 391 మంది మరణించగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,43,019కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,56,546కు పరిమితమైంది. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. గతవారం రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 500ల కంటే తక్కువ నమోదుకావడం గమనార్హం. అలాగే గత పదిహేను రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇవీ చదవండి..

ఒక్కో విడతలో వంద మందికి టీకా!

కరోనా పేరుతో హక్కుల్ని అణచివేస్తోంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని