ఒక్కో విడతలో వంద మందికి టీకా!

ప్రధానాంశాలు

Published : 13/12/2020 04:44 IST

ఒక్కో విడతలో వంద మందికి టీకా!

మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: కొవిడ్‌-19 నియంత్రణ టీకా కార్యక్రమంపై కేంద్రం కొత్త ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్‌వోపీ)ను రూపొందించింది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక వాటిని మెరుగ్గా వేసే విధానాలను ఇందులో పేర్కొంది. ‘‘టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో సన్నద్ధమవుతున్నాం. తద్వారా వేగంగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నాం. ఈ దిశగా వేసిన కీలక ముందడుగు.. ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు. దేశంలో టీకా కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలపైనా ఇది దిశానిర్దేశం చేస్తుంది’’ అని ఆరోగ్యశాఖ ఈ పత్రంలో పేర్కొంది. టీకాల కార్యక్రమం ఎన్నికల ప్రక్రియను పోలి ఉంటుందని తెలిపింది. తాజా ఎస్‌వోపీల ప్రకారం.. ఒక్కో విడతలో 100 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తారు. మౌలిక వసతులు ఉంటే ఆ సంఖ్య 200కు పెరగొచ్చు. వ్యాక్సిన్లు ఏయే రోజుల్లో వేయాలన్న దానిపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు.

* నిర్దిష్ట ప్రదేశాల్లో ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి టీకా వేస్తారు. జనాభాలో ముప్పు అధికంగా ఉన్న వారికి వేయడానికి మాత్రం సంబంధిత ప్రాంతాలకు వెళ్లాల్సి రావొచ్చు. సంచార శిబిరాలు, బృందాలు అవసరం కావొచ్చు. 

* ఒక టీకా బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు ప్రధానాధికారిగా ఉంటారు. ఆయన వైద్యుడు లేదా నర్సు లేదా ఫార్మసిస్టు లేదా ఇంజెక్షన్‌ ఇవ్వడానికి చట్టబద్ధంగా అర్హత కలిగిన వ్యక్తి ఎవరైనా కావొచ్చు. రెండో అధికారి.. భద్రతా అంశాలను చూస్తారు. నమోదును పరిశీలించడం, టీకా ఇచ్చే ప్రదేశంలో ప్రవేశ మార్గాల వద్ద నియంత్రణ వంటి అంశాలను చూస్తారు. మూడో అధికారి.. పత్రాలను తనిఖీ చేస్తారు. మిగతా ఇద్దరు.. రద్దీ నియంత్రణ, కమ్యూనికేషన్‌ వంటి సేవలను అందిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన