18 Pages: ఏడు రంగుల వాన... రెండు కళ్లలోన

నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజీస్‌’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో, సూర్యప్రతాప్‌ పల్నాటి తెరకెక్కించారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు.

Updated : 12 Dec 2022 07:30 IST

నిఖిల్‌ సిద్ధార్థ్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘18 పేజీస్‌’ (18 Pages). ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో, సూర్యప్రతాప్‌ పల్నాటి తెరకెక్కించారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని ‘ఏడు రంగుల వాన...రెండు కళ్లలోన’ అంటూ సాగే పాటని ఆదివారం విడుదల చేశారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ గీతాన్ని, శ్రీమణి రచించారు. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. పాట విడుదల అనంతరం అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘సుకుమార్‌ ఒక విచిత్రమైన ప్రేమకథ చేద్దామంటూ ఈ కథ చెప్పాడు. నిజంగా ఇది సాధారణమైన ప్రేమకథ కాదు. చాలా భిన్నంగా ఉంటుంది. గోపీసుందర్‌ మా సంస్థలో ఇప్పటిదాకా ఏడు సినిమాలు చేశాడు. అన్నీ సంగీత పరంగా మంచి విజయాన్ని అందుకున్నవే. నిఖిల్‌ అంకిత భావంతో పనిచేసే కథానాయకుడు. అనుపమ సహజమైన నటి’’ అన్నారు. నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి నటుడికీ గీతా ఆర్ట్స్‌లో పని చేయడమనేది కల. సుకుమార్‌ రాసిన ఇలాంటి ఓ మంచి కథతో ఆ కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఇదొక భిన్నమైన ప్రేమకథ. సిద్ధు పాత్రలో నటించా. దర్శకుడు సూర్యప్రతాప్‌ చాలా బాగా తీశాడ’’న్నారు. అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘‘నందిని అనే నా పాత్ర భిన్నంగా ఉంటుంది. ‘కార్తికేయ2’ తర్వాత నిఖిల్‌తో మళ్లీ పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో శ్రీమణి, గోపీసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని