నటి రవీనా టండన్‌ పేరుతో నకిలీ ఖాతా

బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి ట్విటర్‌ ఖాతా తెరవడంపై ఆమె ముంబయి సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఖాతా ఆధారంగా సదరు వ్యక్తి ముంబయి పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేలా ట్వీట్లు చేయడంతో నటి రవీనా టండన్‌ స్పందించారు. నటి పేరుతో ఖాతా తెరిచిన సదరు వ్యక్తి సైబర్‌ సెల్‌ ఉన్నతాధికారి పరమ్‌ బీర్‌ సింగ్‌

Published : 31 Oct 2020 22:33 IST

సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు

 

ముంబయి : బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి ట్విటర్‌ నకిలీ ఖాతా తెరవడంపై ఆమె ముంబయి సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సదరు వ్యక్తి ముంబయి పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేలా ట్వీట్లు చేస్తుండటంతో నటి రవీనా టండన్‌ స్పందించారు. నటి పేరుతో ఖాతా తెరిచిన సదరు వ్యక్తి సైబర్‌ సెల్‌ ఉన్నతాధికారి పరమ్‌ బీర్‌ సింగ్‌ ఫోటోలను మార్ఫింగ్‌  చేయడంతో పాటు వీడియోలు రూపొందించి అసభ్యకర సందేశాలను పోస్టు చేస్తున్నట్లు సమాచారం. 

మత విశ్వాసాలు, నమ్మకాలను దెబ్బతిసే విధంగా పోస్టులు పెడుతున్న సదరు వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు వివరించారు. ఈ వ్యక్తి రాష్ర్ట ప్రభుత్వాన్ని, ముంబయి పోలీసులపై అసభ్యకర రీతిలో ట్వీట్లు చేస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన తర్వాత ఆ నకిలీ ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేసినట్లు ఆయన వివరించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని