Allu Sirish: అలా మొదలైంది శిరీష్‌ లవ్‌స్టోరీ.. పోస్టు పెట్టిన నటుడు

Eenadu icon
By Entertainment Team Published : 02 Nov 2025 13:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు అల్లు శిరీష్‌ (Allu Sirish) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నయనిక (Nayanika)తో నిశ్చితార్థం ఈ నెల 31న జరిగింది. చిరంజీవి, రామ్‌ చరణ్‌, సాయి దుర్గాతేజ్‌ తదితరులు సందడి చేశారు. ఈ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. తన లవ్‌స్టోరీ ఎలా మొదలైందో శిరీష్‌ తాజాగా తెలిపారు. తనకు కాబోయే భార్య.. నటుడు నితిన్‌ సతీమణి షాలిని స్నేహితురాలని చెప్పారు. వరుణ్‌తేజ్‌ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరీష్‌ తన ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘వరుణ్‌- లావణ్యల పెళ్లి సమయం (2023 అక్టోబరు)లో నితిన్‌, షాలిని వారికి ఓ పార్టీ ఇచ్చారు. ఆ సెలబ్రేషన్స్‌కు షాలిని బెస్ట్‌ఫ్రెండ్‌ నయనిక కూడా వచ్చింది. తొలిసారి నయనికను అప్పుడే చూశా. తర్వాత ప్రేమించుకున్నాం. నిశ్చితార్థం చేసుకున్నాం. మా పరిచయం ఎలా మొదలైందంటూ ఏదో ఒక రోజు మా పిల్లలు అడిగితే ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్‌లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ థాంక్స్‌’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు