Amitabh : అమితాబ్‌ రూ.1.7 కోట్ల సాయం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఆయన కొవిడ్‌పై చేసే పోరాటంలో భాగంగా పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన విషయం తెలిసిందే.

Updated : 24 Jun 2021 17:18 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఆయన కొవిడ్‌పై చేసే పోరాటంలో భాగంగా పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.1.7 కోట్లు విలువైన అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, ఇతర వైద్య పరికరాల్ని ముంబయిలోని లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రికి అందజేశారు. బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వెంటిలేటర్లను సర్జరీ విభాగంలో అమర్చినట్టు, ఆక్సిజన్‌ స్థాయి తగ్గిన వాళ్లకి, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతోన్న వాళ్లకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు అమితాబ్‌ చేసిన సాయంపై హర్షం వ్యక్తం చేశారు. సినిమా విషయానికొస్తే.. దర్శకుడు వికాస్‌ తెరకెక్కిస్తోన్న ‘గుడ్‌ బై’, అజయ్‌ దేవ్‌గణ్‌ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తోన్న ‘మేడే’ చిత్రాల్లో అమితాబ్‌ నటిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణలో కూడా పాల్గొన్నారాయన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని