Vishwak Sen: గోదావరి గ్యాంగ్‌ విడుదల!

విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Updated : 28 Nov 2023 09:39 IST

విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. నటి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ‘సినిమా ప్రచారాలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది చిత్రయూనిట్‌. ఇప్పటి వరకూ విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌, ‘సుట్టంలా సూసి’ అనే పాట అభిమానులను ఆకట్టుకున్నాయి. చీకటి ప్రపంచంలోని సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి కథనంతో, రాజకీయ కథనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని