Sathyabhama: గురిపెట్టిన సత్యభామ

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో  ప్రకటించింది చిత్రబృందం.

Updated : 23 Apr 2024 09:48 IST

కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో  ప్రకటించింది చిత్రబృందం. ఆ వీడియోలో గన్‌తో గురి పెట్టి లక్ష్యాన్ని ఛేదిస్తూ కనిపిస్తుంది కాజల్‌. ఆమె శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిగా నటించిన చిత్రమిది. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరించడంతోపాటు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ప్రకాశ్‌రాజ్‌, నవీన్‌ చంద్ర తదితరులు  ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్న చిత్రమిది. సత్యభామగా కాజల్‌ నటన ఆకట్టుకుంటుంది. అమరేందర్‌ అనే ఓ కీలక పాత్రలో నవీన్‌ చంద్ర నటిస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు దీటుగా సినిమా ఉంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని