Samantha: బంగారం అంటే మెరవాలా?

సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Updated : 29 Apr 2024 09:26 IST

మంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాని పోస్టర్‌తోపాటు పేరు ప్రకటించారు. అందులో గన్‌ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. ‘‘బంగారం అనిపించుకోవాలంటే ప్రతీదీ మెరిసిపోవల్సిన అవసరం లేదు’’ అనే శీర్షికతో ఈ సినిమాని ప్రకటించారు సమంత. ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆమె, మళ్లీ మునుపటిలా నాజూగ్గా సిద్ధమై కెమెరా ముందుకొస్తున్నారు. పలువురు అగ్ర హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించినా, నాయికా ప్రధానమైన సినిమాతోనే ఆమె పునరాగమనం చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్ర దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలేమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని