Kangana Ranaut: నేను డేటింగ్‌లో ఉన్నా.. కానీ అతడితో కాదు: కంగన

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై జరుగుతోన్న ప్రచారాన్ని ఉద్దేశించి కంగన (Kangana Ranaut) స్పందించారు.

Published : 24 Jan 2024 14:21 IST

ముంబయి: ఈజ్‌ మై ట్రిప్‌ (EaseMyTrip) వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని అన్నారు. ‘‘దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఇదే నా విన్నపం. నిషాంత్‌కి పెళ్లైంది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నా. సరైన సమయం కోసం ఎదురుచూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మాట్లాడటం సబబు కాదు. మళ్లీ ఇలా చేయొద్దు’’ అని స్పష్టతనిచ్చారు.

Prasanth Varma: ‘హను-మాన్‌’.. ఆ పాత్రకు రిషబ్‌ శెట్టిని అనుకున్నా: ప్రశాంత్‌వర్మ

బాలీవుడ్‌లో కంగనకు గుర్తింపు ఉంది. ఇటీవల ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. అతడు తన హెయిర్‌ స్టైలిష్ట్‌ అని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. ఆ కథనాలు మర్చిపోకముందే అయోధ్య రామమందిర్‌ ప్రారంభోత్సవంలో కంగన, నిషాంత్‌ కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు