Bigg Boss Telugu 7: అమ్మాయిలను ఎలా పొగడాలో నాగార్జున దగ్గర నేర్చుకున్నా: కార్తి

Bigg Boss Telugu 7: వీకెండ్‌ ఎపిసోడ్‌లో నటుడు కార్తితో కలిసి నాగార్జున సందడి చేశారు.

Updated : 09 Dec 2023 16:16 IST

హైదరాబాద్‌: ‘అమ్మాయిలను ఎలా పొగడాలో నాగార్జున సర్‌ దగ్గర నేర్చుకున్నా’ అంటూ ‘ఊపిరి’ సినిమా సెట్స్‌లో జరిగిన విషయాలను పంచుకున్నారు నటుడు కార్తి. నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌7’ (Bigg Boss Telugu 7). ఎప్పట్లాగే ఈ శనివారం కూడా వినోదాలను పంచేందుకు వీకెండ్‌ ఎపిసోడ్‌తో నాగార్జున సిద్ధమయ్యారు. ‘జపాన్‌’ (Japan) ప్రమోషన్స్‌లో భాగంగా కార్తి (Karthi) ఈ షోకు వచ్చి సందడి చేశారు. ‘ఊపిరి’ షూటింగ్‌ జరుగుతుండగా,  ‘తమన్నా నువ్వు బ్యూటిఫుల్‌గా ఉన్నావు’ అని అనగానే ఆమె గాల్లో తేలిపోతూ ఉండేదని అప్పటి విషయాలను కార్తి గుర్తు చేసుకున్నారు. ఇక ‘జపాన్‌’ మూవీ గురించి మాట్లాడుతూ.. తన క్యారెక్టర్‌ పూర్తిగా డార్క్‌గా ఉంటుందని చెప్పగా, ‘బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ కొన్ని డార్క్‌ క్యారెక్టర్లు ఉన్నాయి’ అని నాగ్‌ అన్నారు. అశ్వినిని పరిచయం చేస్తూ, ‘ఈ అమ్మాయి అందంగా ఉంటుంది. కానీ పుల్లలు పెడుతుంది’ అనడంతో అందరూ నవ్వేశారు. అలాగే పల్లవి ప్రశాంత్‌ను పరిచయం చేస్తూ ‘ఇప్పుడు మీరు చూస్తున్న క్యారెక్టర్‌ రామం.. నామినేషన్స్‌ సమయంలో అపరిచితుడు బయటకు వస్తాడు’ అంటూ నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆటపట్టించారు. ఆద్యంతం నవ్వులు పంచేలా సాగిన ప్రోమోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని