Cinema News: సంక్షిప్త వార్తలు (2)

‘నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగేనా...’ అంటూ ఓ జంట ప్రేమ పాట పాడుకుంది. మరి ఆ జంట కథేమిటో తెలియాలంటే ‘18 పేజిస్‌’ చూడాల్సిందే. నిఖిల్‌ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రమిది.

Updated : 23 Nov 2022 07:22 IST

ఏ కన్నుకి ఏ స్వప్నమో...

‘నీలో స్వరాలకే నేనే సంగీతమై.. నువ్వే వదిలేసిన పాటై సాగేనా...’ అంటూ ఓ జంట ప్రేమ పాట పాడుకుంది. మరి ఆ జంట కథేమిటో తెలియాలంటే ‘18 పేజిస్‌’ (18 Pages) చూడాల్సిందే. నిఖిల్‌ సిద్ధార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama parameswaran) జంటగా నటించిన చిత్రమిది. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘నన్నయ్య రాసిన...’ పాటని మంగళవారం విడుదల చేశారు. ‘ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పలైన తెలిపేనా... ’ అంటూ సాగుతుంది ఈ పాట. గోపీసుందర్‌ స్వరకల్పనలో, పృథ్వీచంద్ర, సితార కృష్ణకుమార్‌ ఆలపించిన ఈ గీతాన్ని శ్రీమణి రచించారు. అగ్ర దర్శకుడు సుకుమార్‌ రచించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వసంత్‌, కూర్పు: నవీన్‌ నూలి, కళ: రమణ వంక, రచన: శ్రీకాంత్‌ విస్సా.


టీచర్‌ పోరాటం

మె ఓ టీచర్‌...ఓ పక్క వృత్తి జీవితాన్ని, మరో పక్క కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటుంది. కానీ అనుకోకుండా ఆమె జీవితం ఓ కొత్త మలుపు తీసుకుంటుంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌ మోసం కారణంగా బయటకు వస్తుంది. దాంతో ఆ టీచర్‌ సమస్యల్లో చిక్కుకుంటుంది. ఇక తన లైఫ్‌ ముగిసింది అనుకోకుండా న్యాయం కోసం పోరాడుతుంది? దాని కోసం ఏం చేసింది? చివరికి కథ ఎలా ముగిసింది? అనేది ‘ది టీచర్‌’ (The Teacher) సినిమాలో చూడాల్సిందే. అందాల తార అమలా పాల్‌ (Amala Paul) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. వివేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని