Vishwak Sen: నవ్వులు పంచేందుకు..

విష్వక్‌ సేన్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Jul 2023 13:52 IST

విష్వక్‌ సేన్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ప్రకటించాయి. ‘‘వినోదంతో నిండిన యాక్షన్‌ చిత్రమిది. తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించాం. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో పాటు తొలి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌,
ఛాయాగ్రహణం: మనోజ్‌ కాటసాని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని