Bigg Boss Telugu 7: కాన్ఫిడెన్సా లేదా ఓవర్‌ కాన్ఫిడెన్సా.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున క్లాస్‌

Published : 25 Nov 2023 17:36 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7) వీకెండ్‌ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం టాస్క్‌లు, హౌస్‌మేట్స్‌ మధ్య జరిగిన గొడవలపై నాగార్జున విశ్లేషణ చేశారు. ఇన్వెస్టిగేషన్‌ టాస్క్‌లో ప్రశాంత్‌ అసభ్యకర పదజాలం ఉపయోగించడంపై నాగార్జున క్లాస్‌ తీసుకున్నారు. ‘‘దెయ్యం అయ్యాక ఆ బూతులేంటి. మాట్లాడు ప్రశాంత్‌. నామినేషన్స్‌లో అయితే మాట్లాడతావు కదా’’ అని ప్రశ్నించారు. అనంతరం, ఎలిమినేషన్‌లో భాగంగా సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకున్న అశ్వినీని ఉద్దేశిస్తూ.. ‘‘డబుల్‌ ఎలిమినేషన్‌ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా లేదా ఓవర్‌ కాన్ఫిడెన్సా? మనం చేసే పొరపాట్ల కారణంగానే మనం బలైపోతాం’’ అని హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని