Pawankalyan: వీరమల్లు.. పోరాట విల్లు

కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.దయాకర్‌ రావు నిర్మాత. ఎం.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. నర్గిస్‌ ఫక్రి, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 08 Apr 2022 13:54 IST

కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.దయాకర్‌ రావు నిర్మాత. ఎం.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. నర్గిస్‌ ఫక్రి, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.   శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా పవన్‌ కల్యాణ్‌పై ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించనున్నారు. దీని కోసం పవన్‌   ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ టోడోర్‌ లాజరోవ్‌ ఆధ్వర్యంలో ఈ రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఓ చారిత్రక కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని