Virgin Story: యువతరం లక్ష్యంగా..

విక్రమ్‌ సహిదేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ప్రదీప్‌ బి అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘వర్జిన్‌ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా.. అన్నది ఉపశీర్షిక. లగడపాటి శ్రీధర్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల

Updated : 17 Feb 2022 09:07 IST

విక్రమ్‌ సహిదేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ప్రదీప్‌ బి అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘వర్జిన్‌ స్టోరి’. కొత్తగా రెక్కలొచ్చెనా.. అన్నది ఉపశీర్షిక. లగడపాటి శ్రీధర్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో  విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్‌ మాట్లాడుతూ.. ‘‘16ఏళ్ల యువతీ యువకుల మనోభావాలను తెరకెక్కించే చిత్రాలు మన దగ్గర అంతగా రాలేదు. ఇప్పుడీ సినిమాలో దాన్ని ప్రయత్నించాం. యుక్త వయసులో ఉండే అమ్మాయి, అబ్బాయిల మధ్య జరిగే కథ ఇది. మనం నిజంగా ప్రేమించిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు, శరీరం నిజాయితీగా స్పందిస్తాయి. ప్రేమ లేని వాళ్ల దగ్గర ఆ ఫీలింగ్‌ రాదు. అందుకే యువతను సరైన జోడీ ఎంచుకోమని చెప్పే చిత్రమిది. టీనేజ్‌ కుర్రాళ్లతో పాటు పెద్దవాళ్లకూ ఈ సినిమా నచ్చుతుంది. పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకున్న పెద్దవాళ్లు ఈ చిత్రం చూడొచ్చు’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని