Samantha: నిర్మాతగా సమంత

సమంత కొత్త కబురు వినిపించింది. ఇంతవరకు నటిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన ఆమె.. ఇప్పుడు చిత్ర నిర్మాతగానూ మారుతున్నట్లు ప్రకటించింది.

Updated : 11 Dec 2023 09:35 IST

మంత కొత్త కబురు వినిపించింది. ఇంతవరకు నటిగా తెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిన ఆమె.. ఇప్పుడు చిత్ర నిర్మాతగానూ మారుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. తన నిర్మాణ సంస్థకు ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంగ్లిష్‌ పాప్‌ గీతం ‘బ్రౌన్‌ గర్ల్‌ ఇన్‌ ది రింగ్‌’’లోని లిరిక్స్‌లో వచ్చే ‘ట్రా లా లా’ అనే పదాన్ని తీసుకొని ఈ పేరు ఖరారు చేసింది. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు సామ్‌ వెల్లడించింది. ఆమె ప్రస్తుతం ‘సిటాడెల్‌’ వెబ్సిరీస్‌లో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని