Sri Vishnu: పోలీస్‌ ‘అల్లూరి’

శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్కీ మీడియా పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. బెక్కెం వేణుగోపాల్‌, బెక్కెం బబిత నిర్మాతలు. ఈ చిత్రానికి

Updated : 06 Apr 2022 09:24 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా లక్కీ మీడియా పతాకంపై ఓ చిత్రం తెర  కెక్కుతోంది. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కయ్యదు లోహర్‌ కథానాయిక. బెక్కెం వేణుగోపాల్‌, బెక్కెం బబిత నిర్మాతలు. ఈ చిత్రానికి ‘అల్లూరి’ అనే పేరుని ఖరారు చేశారు. ప్రి లుక్‌ని ప్రముఖ కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. ఎ.ఎస్‌.రామరాజు అనే శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నారు. ఇదొక గొప్ప పోలీస్‌ అధికారి కథతో రూపొందుతోంది. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే  ప్రకటిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.   తనికెళ్ల భరణి, సుమన్‌, రాజా రవీంద్ర, పృథ్వీరాజ్‌, రవివర్మ, మధుసూదన్‌ రావు, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజ్‌తోట, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం: రాంబాబు గోసాల, కళ: విఠల్‌ కొసనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని