Macherla Niyojakavargam: మాచర్లలో కేథరిన్‌

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’లో మరో కథానాయికగా కేథరిన్‌ ఎంపికైంది. ఆ విషయాన్ని మంగళవారం చిత్రబృందం

Updated : 30 Jul 2022 14:46 IST

నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’లో మరో కథానాయికగా కేథరిన్‌ ఎంపికైంది. ఆ విషయాన్ని మంగళవారం చిత్రబృందం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా కృతిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఉన్న మరో నాయికకి చోటుండగా, ఆ స్థానాన్ని కేథరిన్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లోనే కేథరిన్‌ చిత్రీకరణలో పాల్గొంటుంది. నితిన్‌, కేథరిన్‌ జోడీగా నటిస్తున్న తొలి సినిమా ఇదే. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పకులు. నితిన్‌ని ఇదివరకెప్పుడూ చూడని ఓ సరికొత్త అవతారంలో ప్రేక్షకులు చూడనున్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేష్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని