
Sonal Chauhan: ఘోస్ట్ కోసం సోనాల్
‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘రూలర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉత్తరాది అందం సోనాల్ చౌహాన్. ప్రస్తుతం ఆమె వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో కలిసి ‘ఎఫ్3’ సినిమాలో సందడి చేస్తోంది. ఇప్పుడీ అమ్మడు తెలుగులో మరో క్రేజీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. కథానాయికగా తొలుత కాజల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. దీంతో ఆ పాత్ర కోసం అమలాపాల్, జాక్వెలిన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడీ పాత్రను సోనాల్ చౌహాన్ దక్కించుకుందని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు సోనాల్ అంగీకరించినట్లు తెలిసింది. ఇందులో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యాక్షన్: రాబిన్ సుబ్బు, నభా మాస్టర్, ఛాయాగ్రహణం: ముఖేశ్.జి.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.