‘ఆచార్య’ తర్వాత చిరు నటించే చిత్రమేది?

అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇటీవల వరుస సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌

Updated : 06 Sep 2020 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇటీవల వరుస సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే తిరిగి షూటింగ్‌ ప్రారంభించాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరు నటించబోయే తర్వాతి చిత్రాలపై ఒక క్లారిటీ వచ్చినట్లు టాలీవుడ్‌ టాక్‌.

‘ఆచార్య’ తర్వాత చిరు ముందు రెండు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌లో తాను నటిస్తానని చిరు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను యువ కథానాయకుడు సుజీత్‌కు అప్పగించారు. అయితే, సుజీత్‌ చెప్పిన మార్పులు చిరుకు నచ్చకపోవడంతో సినిమా నుంచి ఆయనను తప్పించినట్లు తెలుస్తోంది. ఆ అవకాశం వి.వి.వినాయక్‌ అందుకున్నారని సమాచారం. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘ఠాగూర్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ రీమేక్‌ చిత్రాలే. ఇప్పుడు ‘లూసిఫర్‌’కు దర్శకత్వం వహిస్తే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది. ఇందులోనూ రామ్‌చరణ్‌  ఓ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ లేదా టోవినో థామస్‌ పోషించిన పాత్రల్లో ఏదో ఒకటి చేస్తారని టాక్‌.

పవన్‌తో చేద్దామనుకున్నారు.. చిరు చేస్తున్నారు

అజిత్‌ కథానాయకుడిగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘వేదాళం’. తొలుత ఈ సినిమాను పవన్‌తో చేద్దామనుకున్నారు. ఆయన రాజకీయాల్లో వెళ్లిపోవడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం పవన్‌ వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ‘వేదాళం’ చిరు దగ్గర ఆగింది. మరోవైపు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ఓ సినిమాలో నటించనున్నారు. ఇటీవల పవన్‌ పుట్టినరోజు సందర్భంగా మెహర్‌ రమేశ్‌ శుభాకాంక్షలు చెప్పారు. అందుకు  పవన్‌ కృతజ్ఞతలు చెబుతూ, ‘చిరంజీవితో మీరు సినిమా తీస్తున్నందుకు శుభాకాంక్షలు’ అని అన్నారు. అంటే చిరుతో మెహర్‌ రమేశ్‌ చిత్రం ఓకే అయినట్లే. ‘వేదాళం’ రీమేక్‌ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మెహర్‌ రమేశ్‌ కథను సిద్ధం చేస్తున్నారు. అయితే, ‘లూసిఫర్‌’, ‘వేదాళం’ రీమేక్‌ చిత్రాల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందన్నది క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని