BJP: తెలంగాణలో భాజపా విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం

తెలంగాణలో భాజపా (BJP) విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Updated : 20 Feb 2024 15:06 IST

నారాయణపేట: తెలంగాణలో భాజపా (BJP) విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శంఖారావం పూరించారు. 

ఆ పార్టీ రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి యాత్రలను కొనసాగించనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కి.మీ మేర యాత్రలు  నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్‌ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న ఇవి ముగియనున్నాయి. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్‌ కుంభకోణాలు, భారాస వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని భాజపా నేతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని