Telangana News: కమిటీ నివేదిక తర్వాతే పీకే విషయంలో నిర్ణయం: భట్టి విక్రమార్క

రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్‌ కిషోర్ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఒక కమిటీ వేసిందని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని

Published : 25 Apr 2022 16:08 IST

హైదరాబాద్‌: రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్‌ కిశోర్ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఒక కమిటీ వేసిందని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుందని.. కాంగ్రెస్‌లో ఎవరూ ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. కొందరు పనిగట్టుకుని కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాణికం ఠాగూర్ చేసిన ట్వీట్‌లో శత్రువును నమ్మొద్దు అని అన్నారు కానీ ఆ శత్రువు ఎవరనే విషయం చెప్పలేదని.. అందులో తప్పేముందని భట్టి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని