Priyanka Gandhi: మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు.

Updated : 18 Oct 2023 19:59 IST

ములుగు: కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వివరించారు.

‘‘ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ, భారాస అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది.  రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారు. ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఒక రోడ్‌ మ్యాప్‌ రూపొందించింది. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని