ఆ కుటుంబంలో పుట్టడంవల్లే దేశాన్ని పాలించే హక్కు ఉందనుకుంటున్నారు

తాను ఆ కుటుంబంలో పుట్టడంవల్లే దేశాన్ని పాలించే హక్కు ఉందని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారని భాజపా విమర్శించింది.

Published : 30 Mar 2023 05:53 IST

రాహుల్‌పై భాజపా విమర్శ

దిల్లీ: తాను ఆ కుటుంబంలో పుట్టడంవల్లే దేశాన్ని పాలించే హక్కు ఉందని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారని భాజపా విమర్శించింది. అన్ని వ్యవస్థలు తనకింద ఉండాలని అనుకుంటారని, అందుకే కోర్టు ఆదేశాలతో ఆయన కంగుతిన్నారని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ఆయన రాజ్యాంగం, కోర్టులు, పార్లమెంటుకంటే ఉన్నతుడిగా భావించుకుంటారని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రస్తుత ప్రభుత్వంపై అవినీతిపరులందరూ ఏకమై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు