20 నుంచి పవన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించనున్నారు.

Updated : 19 Apr 2024 06:47 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించనున్నారు. ఈనెల 20న పిఠాపురంలో తెదేపా అంతర్గత సమావేశంలో పాల్గొని, అనంతరం రాజానగరంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

  •  21న భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొంటారు. 
  •  23న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారు. అనంతరం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొంటారు. 
  •  24న రాజంపేట, రైల్వే కోడూరులో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తారు. 25 నాటి షెడ్యూల్‌ ఖరారు కాలేదు.
  •  26న రాజోలు, రామచంద్రాపురం, 27న పెద్దాపురం, కాకినాడ గ్రామీణం, 28న జగ్గంపేట, ప్రత్తిపాడులో ప్రచారం చేస్తారు.
  •  29న తిరుపతి, 30న పోలవరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచార సభలు నిర్వహిస్తారు.
  •  ఏప్రిల్‌ 1న యలమంచిలి, పెందుర్తి, 2న విశాఖ దక్షిణం స్థానాల్లో పర్యటిస్తారు.
  • 3న నెల్లిమర్ల, పాలకొండ, 4న తుని, పిఠాపురం, 5న గుడివాడ, పామర్రు, 6న రేపల్లే, అవనిగడ్డ, 7న గన్నవరం, పెనమలూరు ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. 8, 9 తేదీల షెడ్యూల్‌ ఖరారు కాలేదు.
  • 10న పిఠాపురంలో మరోసారి రోడ్డు షోలో పాల్గొని, అనంతరం సభలో ప్రసంగిస్తారు.
  •  ప్రచారం చివరి రోజైన 11న కాకినాడ గ్రామీణంలో రోడ్డు షో నిర్వహిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని