రెండోరోజు 367 నామినేషన్లు దాఖలు

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Published : 20 Apr 2024 04:29 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నామినేషన్‌ సమర్పించిన వారిలో తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి (కుప్పం), మంత్రి బొత్స సత్యనారాయణ (వైకాపా, చీపురుపల్లి) తదితరులు ఉన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా తెదేపా నుంచి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్‌ వేశారు. అరకు పార్లమెంటరీ స్థానానికి వైకాపా అభ్యర్థిని తనూజారాణి తరఫున ఆమె ప్రతినిధులు నామినేషన్‌ వేశారు. సాలూరు నుంచి ఉపముఖ్యమంత్రి రాజన్నదొర (వైకాపా) నామినేషన్‌ దాఖలు చేశారు. నెల్లూరు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కె.రాజు నామినేషన్‌ అందించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్‌ (వైకాపా), హిందూపురంలో నందమూరి బాలకృష్ణ (తెదేపా) నామినేషన్‌ వేశారు. కడప లోక్‌సభ స్థానానికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి (వైకాపా) నామినేషన్‌ సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని