వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక

భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు.

Published : 20 Apr 2024 04:41 IST

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో 100 మంది వాలంటీర్లు వారి పోస్టులకు రాజీనామా చేసి.. శుక్రవారం తెదేపాలో చేరారు. నెల్లూరు గోమతినగర్‌ నారాయణ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వాలంటీర్లకు నారాయణ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపాలో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను చూసి వాలంటీర్లు తెదేపాలోకి వస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని