వైఎస్సార్‌ వ్యక్తి పేరా? పార్టీ పేరా?

ప్రభుత్వ పథకాలకు ‘ఎదుగురి సందింటి రాజశేఖరరెడ్డి’ అని పూర్తి పేరు పెట్టాలి గాని వైఎస్సార్‌ అని పెట్టడంవల్ల అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రభావితం చేస్తోందని

Published : 25 Sep 2022 04:59 IST

అభ్యంతరం తెలుపుతూ ఈసీకి విశాఖ కార్పొరేటర్‌ ఫిర్యాదు

మద్దిలపాలెం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పథకాలకు ‘ఎదుగురి సందింటి రాజశేఖరరెడ్డి’ అని పూర్తి పేరు పెట్టాలి గాని వైఎస్సార్‌ అని పెట్టడంవల్ల అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రభావితం చేస్తోందని పేర్కొంటూ విశాఖ నగర జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చి పార్టీ పేరు సూచించే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల సంఘానికి శనివారం ఫిర్యాదు చేశామనిచెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ పేరు సూచించే విధంగా 55 ప్రభుత్వ పథకాలకు పేరు పెట్టిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని