బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా?

అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు, యువతుల డైట్‌లో ఓట్స్‌ తప్పకుండా ఉండాల్సిందే... కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది. చిరుతిండిగానూ దీన్ని తింటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏదీ తింటే మంచిది అంటే...

Updated : 03 May 2024 11:52 IST

అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు, యువతుల డైట్‌లో ఓట్స్‌ తప్పకుండా ఉండాల్సిందే... కాలక్రమేణా ఈ జాబితాలోకి మ్యూజ్లీ చేరింది. చిరుతిండిగానూ దీన్ని తింటున్నారు. అయితే బరువు తగ్గాలంటే ఈ రెండింటిలో ఏదీ తింటే మంచిది అంటే...

ప్రొటీన్‌, ఫైబర్‌, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలను అందించడంలో ఓట్స్‌, మ్యూజ్లీ రెండూ దేనికవే సాటి. కానీ బరువు తగ్గాలనుకునేవాళ్లు మాత్రం ఓట్స్‌ను అల్పాహారంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

  • తృణధాన్యాల్లో గ్లూటెన్‌ లేనివి ఓట్స్‌ మాత్రమే. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. మ్యూజ్లీలో పాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, గింజలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనిలో కెలోరీలు ఎక్కువ.
  • ఓట్‌ మీల్‌ ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది. అల్పాహారంలో దీన్ని తినడం వల్ల ఆకలినీ నియంత్రిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మ్యూజ్లీ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
  • రోజూ ఒకేరకమైన అల్పాహారం తిని విసుగనిపించే వాళ్లు మిల్కీ, వెజిటబుల్‌ ఓట్స్‌ మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ, వడ లాంటివీ దీంతో చేసుకుని తినొచ్చు. మ్యూజ్లీతో అది సాధ్యం కాదు. పైగా చాలామంది దీన్ని చక్కెరతో కలిపి తినడానికి ఇష్టపడతారు.
  • ఓట్స్‌ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలంటే రెండింటిలో ఓట్స్‌ బెటరన్నమాట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్