Rajasthan: జైపుర్‌లో భాజపా ఆందోళనపై జలఫిరంగులు

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిందని, పలు పరీక్ష పేపర్ల లీకేజీతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ రాజస్థాన్‌ భాజపా నేతలు చేపట్టిన ఆందోళనపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు.

Published : 13 Jun 2023 23:57 IST

జైపుర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిందని, పలు పరీక్ష పేపర్ల లీకేజీతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ రాజస్థాన్‌ భాజపా నేతలు చేపట్టిన ఆందోళనపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రాజధాని నగరం జైపుర్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదుట మంగళవారం ఈ ఘటన జరిగింది. రాష్ట్ర మంత్రి శాంతి ధారీవాల్‌ అవినీతి పెరిగిందని.. మైనింగ్‌, జల్‌జీవన్‌ మిషన్‌ పథకాల్లో కుంభకోణాలు చోటుచేసుకున్నాయని భాజపా నేతలు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చిన భాజపా నేతలను సచివాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సి.పి.జోషి, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌ తదితరులు అక్కడే ధర్నాకు దిగారు. ధర్నా అనంతరం భాజపా నేతలు దిష్టిబొమ్మను తగులబెట్టడంతో పోలీసులు జలఫిరంగులు ఉపయోగించి వారిని చెదరగొట్టారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని