AP News: వైకాపాలోని ఓ వర్గానికి మంత్రి సురేశ్‌ భయపడుతున్నారు: అచ్చెన్న

ఏపీలో ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజంగా కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు

Updated : 08 Dec 2022 15:47 IST

అమరావతి: ఏపీలో ఎస్సీలను అణచివేయడమే వైకాపా నైజంగా కనిపిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో దళితులపై వైకాపా నాయకుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికల్లో  వైకాపా నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని నిలదీశారు.
సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపాలోని ఓ వర్గానికి సురేశ్‌ భయపడుతున్నారని అచ్చెన్న చెప్పారు. భయపడకపోతే దాడి చేసిన నేతలను సస్పెండ్ చేయాలన్నారు. దళితుల భూములు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వైకాపా నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని