TJS-Congress: తెజస-కాంగ్రెస్‌ పొత్తుపై అధిష్ఠానం నిర్ణయిస్తుంది: మల్లు రవి

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల అంశంపై తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి చర్చలు జరిపారు.

Published : 16 Oct 2023 20:44 IST

హైదరాబాద్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల అంశంపై తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి చర్చలు జరిపారు. నాంపల్లిలోని తెజస పార్టీ కార్యాలయంలో వీరు భేటీ అయ్యారు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ, తెజస మధ్య పొత్తు అంశంపై విస్తృతంగా చర్చించారు. తెజస నేత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ తన తొలి జాబితా ప్రకటించిందని తెజస వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజకీయ అవగాహన కోసమే కోదండరామ్‌తో చర్చలు జరిపామని.. పొత్తులపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మల్లు రవి తెలిపారు. సీట్ల సర్దుబాటుపై స్పందించిన కోదండరామ్‌.. తమ డిమాండ్లను కాంగ్రెస్‌ అధిష్ఠానానికి వివరిస్తామన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ను 12 సీట్లు కేటాయించాలని కోరామని తెజస నేతలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని