Virat Kohli: కోహ్లీ ఎప్పుడు రిటైర్‌ అవుతాడంటే.. : ఏబీ డివిలియర్స్‌

Eenadu icon
By Sports News Team Published : 28 Oct 2025 11:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తన అంతర్జాతీయ కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడు. అతడు ఇప్పటికే టీ 20, టెస్ట్‌ ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఆసీస్‌తో మూడు వన్డేల నేపథ్యంలో మొదటి రెండు మ్యాచుల్లో వరుసగా రెండుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడో వన్డేలో మాత్రం రిథమ్‌ అందుకుని 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ విరాట్‌కు మద్దతుగా నిలిచాడు. 

‘కోహ్లీని సెలబ్రేట్‌ చేసుకోనివ్వండి. అతడు లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకోనివ్వండి. కృతజ్ఞతలు అందుకునేందుకు విరాట్‌ అర్హుడు. నాకు తెలిసి అతడిలో మరో అయిదేళ్లు క్రికెట్‌ ఆడగల సత్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం కోహ్లీ వన్డే వరల్డ్‌ కప్‌ 2027 తర్వాత తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడు. ఐపీఎల్‌లో (IPL) కొనసాగుతాడు. అతడు మరో మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు, కుదిరితే అయిదేళ్లు మనకు మైదానంలో కనిపిస్తాడు. ఐపీఎల్‌ కంటే కూడా వరల్డ్‌కప్‌ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది’ అని ఏబీ డివిలియర్స్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో అన్నాడు. 

అలాగే జట్టులో విరాట్‌కు ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో కూడా అతడు వివరించాడు. ‘జట్టులో కోహ్లీ ఉన్నాడంటే చాలు.. మిగతా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్‌, రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఇతర ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారనడంలో సందేహం లేదు. మరో విషయం ఏంటంటే.. వారు కొన్నిసార్లు బ్యాట్‌తో రాణించలేకపోయినా.. జట్టు మీద తమదైన ముద్ర వేయగలరు’ అని ఏబీ డివిలియర్స్‌ విశ్లేషించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని