IND vs ENG: ఇంగ్లాండ్ బ్యాటర్లు అలా చేస్తే నాకే లాభం: జస్‌ప్రీత్‌ బుమ్రా

ఇంగ్లాండ్ ‘బజ్‌బాల్‌’ వ్యూహం గురించి భారత పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాట్లాడాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడితే తనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నాడు.

Published : 23 Jan 2024 19:52 IST

ఇంటర్నెట్ డెస్క్: పునరాగమనం తర్వాత టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన అతడు.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రాణించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG 2024)ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బజ్‌బాల్‌ ఆటతో టీమ్ఇండియా (Team India)ను ఇరుకున పెట్టాలని ఇంగ్లాండ్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యర్థి జట్టు బజ్‌బాల్‌ వ్యూహం గురించి బుమ్రా మాట్లాడాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడితే తనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నాడు. 

‘‘ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ను నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ, ఇటీవల కాలంలో ఆ టీమ్‌ దూకుడుగా ఆడుతోంది. టెస్టు క్రికెట్‌ను ఇలా కూడా ఆడొచ్చని ఇంగ్లాండ్ ప్రపంచానికి చూపించింది. ఒక బౌలర్‌గా ఆ జట్టుపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్లు దూకుడుగా ఆడితే నన్ను అలసటకు గురిచేయలేరు. అందువల్ల నాకు ఎక్కువ వికెట్లు పడగొట్టే అవకాశం దొరుకుతుంది. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాను’’ అని బుమ్రా వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని