Look out: సుశీల్‌పై బిగుస్తున్న ఉచ్చు
భారత అగ్రశ్రేణి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఉచ్చు బిగుస్తోంది. ఓ హత్య కేసులో అతడిని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు....
దిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఉచ్చు బిగుస్తోంది. ఓ హత్య కేసులో అతడిని పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియడం లేదు. తప్పించుకొని తిరుగుతున్నట్టు సమాచారం.
ఈ నెల 4న దిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్ దంకడ్ అనే జాతీయ స్థాయి రెజ్లర్ మరణించాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్, అమిత్‌కుమార్‌లపై జరిగిన దాడిలో సుశీల్‌తో పాటు అతడి మిత్రులు కొందరు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తమపై దాడికి పాల్పడింది సుశీల్, అతడి మిత్రులే అని గాయపడ్డ ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాడి జరిగినప్పటి నుంచి సుశీల్ తప్పించుకొని తిరుగుతుండటంతో పోలీసు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి.
‘దాడి జరిగినప్పుడు సుశీల్ స్టేడియంలోనే ఉన్నాడని సాంకేతిక ఆధారాలతో ధ్రువీకరించాం. అతడిని అరెస్టు చేసేందుకు దిల్లీ, ఉత్తరాఖండ్‌లో వెతుకుతున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. తొలుత హరిద్వార్‌లో అతడి ఆచూకీ లభ్యమైందన్నారు. ఆ తర్వాత రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందాడన్నారు. ఆ తర్వా హరియాణాలో గుర్తించామన్నారు. అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు అతడు ప్రతిసారీ తన చోటును మారుస్తున్నాడని వెల్లడించారు. అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్‌ల మీద ఐపీఎల్ మ్యాచ్‌లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్‌లను వాడనున్నారు. ఏంటా పిచ్‌లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్‌వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్‌లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్‌బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్‌లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్‌జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్‌కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరిగేది వెస్టిండీస్‌లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.