Viral: 83 ఏళ్ల వయసులో ఆక్సిజన్‌ సిలిండర్‌తో వికెట్ కీపింగ్‌

సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్లలోపు రిటైరవుతుంటారు. ఫిట్‌గా ఉంటే మరో రెండు, మూడేళ్లు ఆడతారు. కానీ, ఓ క్రికెటర్‌ 83 ఏళ్ల వయసులోనూ క్రికెట్‌ ఆడేస్తున్నాడు.  

Published : 08 Aug 2023 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్లలోనే రిటైరవుతుంటారు. ఫిట్‌గా ఉంటే మరో రెండు, మూడేళ్లు ఆడతారు. ఆ తర్వాత కామెంటేటర్‌గానో, విశ్లేషకుడిగానో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. కానీ, ఓ క్రికెటర్‌ 83 ఏళ్ల వయసులోనూ క్రికెట్‌ ఆడేస్తున్నాడు. అతడు అనారోగ్యంతో బాధపడుతున్నా ఆటపై ఉన్న ఇష్టంతో మైదానంలో బ్యాట్‌ పట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరంటే.. స్కాట్లాండ్ మాజీ క్రికెటర్‌ అలెక్స్‌ స్టీల్ (Alex Steele). 83 ఏళ్ల వయసులోనూ ఈయన క్లబ్‌ క్రికెట్ ఆడుతున్నాడు. 

నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ

అలెక్స్‌ స్టీల్ 2020 నుంచి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ఆక్సిజన్‌ సిలిండర్‌ ధరించి క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలెక్స్‌ స్టీల్ 1960ల్లో స్కాట్లాండ్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అతడు కెరీర్‌లో 14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 621 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు అందుకుని 2 స్టంపింగ్‌లు చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని