World Cup: ప్రపంచకప్‌ టికెట్ల నమోదు షురూ

అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ టికెట్ల నమోదు మొదలైంది.

Updated : 16 Aug 2023 04:08 IST

దుబాయ్‌: అభిమానులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్‌ టికెట్ల నమోదు మొదలైంది. ఆగస్టు 25న ఆరంభమయ్యే టికెట్ల అమ్మకాలకు ముందు అభిమానులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఐసీసీ కోరింది. మంగళవారమే ఈ రిజిస్ట్రేషన్‌ లింక్‌ అందుబాటులోకి వచ్చింది. https:///www.cricketworldcup.com/rgister లింక్‌ను క్లిక్‌ చేసి అభిమానులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆగస్టు 25న భారతేతర వార్మప్‌, ఇతర జట్ల టోర్నీ మ్యాచ్‌లకు టికెట్లు అమ్ముతారు. ఆ తర్వాత గువాహాటి, తిరువనంతపురం (ఆగస్టు 30), చెన్నై, దిల్లీ, పుణె (ఆగస్టు 31), ధర్మశాల, లఖ్‌నవూ, ముంబయి (సెప్టెంబర్‌ 1), బెంగళూరు, కోల్‌కతా (సెప్టెంబర్‌ 2), అహ్మదాబాద్‌ (సెప్టెంబర్‌ 3)లో జరిగే టీమ్‌ఇండియా మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి వస్తాయి. 15న సెమీఫైనల్‌, ఫైనల్‌ టికెట్లు కొనుక్కోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని