మహేశ్వరికి పారిస్‌ కోటా స్థానం

షూటింగ్‌లో భారత్‌కు మరో ఒలింపిక్‌ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్‌ పారిస్‌ బెర్తు సాధించింది.

Published : 29 Apr 2024 01:47 IST

దిల్లీ: షూటింగ్‌లో భారత్‌కు మరో ఒలింపిక్‌ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్‌ పారిస్‌ బెర్తు సాధించింది. ఆదివారం మహిళల స్కీట్‌ ఫైనల్లో మహేశ్వరి 3-4తో ఫ్రాన్సిస్కా (చిలీ) చేతిలో ఓడింది. క్వాలిఫికేషన్లో 121 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ముందంజ వేసిన మహేశ్వరి.. ఫైనల్లో అదిరే ప్రదర్శన చేసింది. 54-54తో ఫ్రాన్సిస్కాతో సమంగా నిలిచింది. కానీ షూటాఫ్‌లో తడబడి పసిడి కోల్పోయింది. మహిళల స్కీట్‌లో భారత్‌కు దక్కిన రెండో కోటా స్థానమిది. మొత్తంగా ఇది 21వ కోటా స్థానం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని