Sports news: ట్రిపుల్‌జంప్‌లో సెల్వాకు రజతం

ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వా తిరుమారన్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో 17 ఏళ్ల సెల్వా 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో జాడెన్‌ హిబర్ట్‌ (జమైకా, 17.27 మీటర్లు) స్వర్ణం

Updated : 07 Aug 2022 05:34 IST

కాలి (కొలంబియా): ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు పతకాల జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వా తిరుమారన్‌ రజతం గెలిచాడు. ఫైనల్లో 17 ఏళ్ల సెల్వా 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో జాడెన్‌ హిబర్ట్‌ (జమైకా, 17.27 మీటర్లు) స్వర్ణం నెగ్గాడు. మహిళల 4×400 మీటర్ల రిలే పరుగులో భారత్‌ ఫైనల్‌ చేరింది. క్వాలిఫయింగ్‌లో సమీ, ప్రియా మోహన్‌, రజిత కుంజ, రూపల్‌తో కూడిన భారత జట్టు 3 నిమిషాల 34.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్‌ ఈ టోర్నీలో మూడు పతకాలు సాధించింది. 2021 నైరోబిలో జరిగిన టోర్నీలో మూడు పతకాలు (రెండు రజతాలు, ఒక కాంస్యం) నెగ్గిన భారత్‌.. ఈసారి ఆ సంఖ్యను దాటేలా ఉంది.

అదరగొట్టిన నందిని: అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని అదరగొట్టింది. మహిళల 100 మీ. హార్డిల్స్‌లో ఫైనల్‌ చేరిన ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. సెమీస్‌లో ఆమె 13.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (13.58సె)ను మరోసారి మెరుగుపర్చింది. హీట్స్‌-3లో మూడో స్థానంలో నిలిచిన ఆమె ఓవరాల్‌గా ఏడో స్థానంతో తుది పోరుకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని