Pillow Fight: పిల్లో ఫైట్‌.. ఇప్పుడక్కడ ప్రొఫెషనల్‌ క్రీడ!

చిన్నప్పుడు ఇంట్లో తోబుట్టువులతో దిండుతో కొట్లాడుకున్న(పిల్లో ఫైట్‌) రోజులు గుర్తున్నాయా..?! చాలా సరదాగా ఉండేది కదా! దిండ్లు మెత్తగా ఉంటాయి కాబట్టి ఎంత గట్టిగా కొట్టినా దెబ్బతగిలేది కాదు. దీంతో ఎవరికి ఎక్కువ సార్లు దిండు తగిలితే వారు ఓడినట్లు. చిన్న పిల్లలు ఆడుకునే ఈ ఆటలో

Published : 03 Feb 2022 02:30 IST

ఫ్లోరిడా: చిన్నప్పుడు ఇంట్లో తోబుట్టువులతో దిండుతో కొట్లాడుకున్న(పిల్లో ఫైట్‌) రోజులు గుర్తున్నాయా..?! చాలా సరదాగా ఉండేది కదా! దిండ్లు మెత్తగా ఉంటాయి కాబట్టి ఎంత గట్టిగా కొట్టినా దెబ్బతగిలేది కాదు. దీంతో ఎవరు ఎక్కువ సార్లు దిండు కొట్టితే వారే గెలిచినట్టు. చిన్న పిల్లలు ఆడుకునే ఈ ఆటలో ఓ కిక్కు ఉంటుంది. ఇప్పుడు ఆ కిక్కు కోసమే ఫ్లోరిడాలో పిల్లో ఫైట్‌ను అధికారిక ప్రొఫెషనల్‌ క్రీడా పోటీగా మార్చేశారు. అయితే, చిన్న పిల్లల కోసం కాదండోయ్‌.. పెద్దవాళ్ల కోసం ప్రవేశపెట్టిన క్రీడ. ఇందులో పాల్గొనడానికి ఫ్రొపెషనల్‌ ఫైటర్లు, రెజర్లు, అథ్లెట్లు, మిలటరీలో ఉద్యోగులు మాత్రమే అర్హులు. కాగా.. జనవరిలో ‘పిల్లో ఫైట్‌ ఛాంపియన్‌షిప్‌(పీఎఫ్‌సీ) పేరుతో ఈ పోటీలు జరిగాయి. 24 మంది పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో 16 మంది, మహిళల విభాగంలో ఎనిమిది మంది పోటీపడ్డారు.

ఆట ఏంటంటే.. బాక్సింగ్‌ రింగ్‌లాంటి వేదికపై ఇద్దరు పోటీదారులు దిండుతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలి. పోటీదారుడు ప్రత్యర్థిని దిండుతో కొట్టిన ప్రతిసారి తన ఖాతాలో పాయింట్లు పడతాయి. ఆట ముగిసే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉంటే వారు విజేతలవుతారు. అలా గత జనవరి 29న నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో టిల్‌మ్యాన్‌, మహిళల విభాగంలో ఇస్టెల్లా నున్స్‌ ఛాంపియన్లుగా నిలిచారు. విజేతలకు నిర్వాహకులు రూ. 5వేల యూఎస్‌ డాలర్లు, ఛాంపియన్‌షిప్‌ బెల్ట్‌.. ఒక పిల్లో బహుమతిగా ఇచ్చారు. ఈ పిల్లో ఫైట్‌ టెర్నమెంట్‌ను జపాన్‌ సహా పలు దేశాల్లో స్థానికంగా వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. అయితే, అధికారికంగా నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని