telangana panchayat elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది

Eenadu icon
By Telangana News Team Updated : 25 Nov 2025 19:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (telangana panchayat elections 2025) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో (telangana panchayat elections date) పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు.

‘‘సెప్టెంబర్‌ 29న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ 9న షెడ్యూల్‌పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,236 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. గురువారం (నవంబర్‌ 27) నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :
Published : 25 Nov 2025 18:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని