మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించండి

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Updated : 09 Dec 2023 09:01 IST

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నవంబరు 1న ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూ.86 వేల కోట్లు సేకరించడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు డ్యాం సేఫ్టీ అథారిటీ, సీబీఐ, జాతీయ విపత్తుల నిర్వహణ మండలి, ఎస్‌ఎఫ్‌ఐఓ తదితరులను చేర్చారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని