65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ సిబ్బందికి విశ్రాంతి

అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  సంబంధిత వివరాలు ఏప్రిల్‌ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు.

Published : 30 Apr 2024 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  సంబంధిత వివరాలు ఏప్రిల్‌ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్‌ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది. పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని