అలసట తీర్చుతూ.. సమయానికి నిద్ర లేపుతూ..

ఉద్యోగులు కాసేపు నిద్రపోతే విధులు మరింత సమర్థంగా నిర్వహిస్తారనే ఆలోచనతో కొన్నేళ్ల క్రితమే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో నిద్రపోవడానికి ఏర్పాట్లు చేశాయి.

Updated : 18 May 2024 05:52 IST

ఉద్యోగులు కాసేపు నిద్రపోతే విధులు మరింత సమర్థంగా నిర్వహిస్తారనే ఆలోచనతో కొన్నేళ్ల క్రితమే పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో నిద్రపోవడానికి ఏర్పాట్లు చేశాయి. ఈ క్రమంలోనే మసాజ్, సంగీతం, ఆక్సిజన్‌ థెరపీలతో సమయానికి నిద్రలేపే యంత్రాలు వచ్చాయి. హైదరాబాద్‌లోని నార్సింగిలో శుక్రవారం జరిగిన తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ 10వ జాతీయ సదస్సులో దీన్ని ప్రదర్శించారు. ఇది మానవ ఉత్పాదకత.. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఒత్తిడి, అలసటతో ఉన్న సిబ్బందికి ఇది ప్రయోజనకరమన్నారు. రూ.7.5 లక్షల విలువచేసే ఈ యంత్రాన్ని నెలవారీ అద్దెతో కూడా అందించనున్నారు. జెంటిల్‌ బ్యాక్‌ మసాజ్, ఆక్సిజన్‌ థెరపీ, ధ్యాన సంగీతం, వెంటిలేటెడ్‌ సీట్, ఫ్రెష్‌ఎయిర్‌ ఇన్‌లెట్‌ సౌకర్యాలు ఉండటంతోపాటు నిద్రలేపడం ఈ యంత్రం ప్రత్యేకత.

ఈనాడు హైదరాబాద్, న్యూస్‌టుడే, నార్సింగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని