Published : 04/07/2022 20:52 IST

బార్లీతో భలేగా!

శరీరం చక్కగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది.. కానీ మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం.. ఇలా ఎన్నో సమస్యలు. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెడుతుంది ఈ బార్లీ ఫేషియల్!

కావాల్సినవి

* బార్లీ గింజల పొడి - రెండు చెంచాలు

* గోరువెచ్చటి నీళ్లు - సరిపడా

తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా!

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై నల్ల మచ్చలు ఉన్న చోట పూసి ఓ పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేసుకుని మెత్తని గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మంపై ఉండే మచ్చలు, మృత కణాలు.. తొలగిపోయి చర్మం నాజూగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని