దగ్గు, జలుబు.. ఈ వంటింటి చిట్కాలతో దూరం!

చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు మామూలే. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో కిచెన్‌లోని కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం,  గార్గిల్‌ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి....

Published : 23 Nov 2022 19:49 IST

చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు మామూలే. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో కిచెన్‌లోని కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం,  గార్గిల్‌ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. ‘వంటగదే మన ఫార్మసీ’ అంటూ కొన్ని చిట్కాలను పంచుకుంటున్నారు.. మరి అవేంటో చూద్దాం రండి..

⚜ ఒక టీస్పూన్‌ పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకోవాలి.

⚜ రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగాలి.

⚜ ఉసిరి, పైనాపిల్‌, నిమ్మ, కివీ మొదలైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

⚜ ఒక లీటరు నీటిలో 7-8 తులసి ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఒక టీస్పూన్‌ చొప్పున వాము, మెంతులు, పసుపు, 4-5 నల్ల మిరియాలు వేసి మరిగించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని తాగండి.

⚜ స్నానం చేసేందుకు, తాగేందుకు చల్లటి నీరును ఉపయోగించద్దు.

⚜ జీర్ణక్రియ మెరుగయ్యేందుకు ఎక్కువగా గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.

⚜ ఏమైనా గొంతు సమస్యలుంటే తేనె మంచి ఉపశమనమిస్తుంది.

⚜ సాధారణ టీ, కాఫీలకు బదులు అల్లం, పసుపు, లెమన్‌టీలు తాగడం మంచిది.

⚜ గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది.

⚜ గొంతునొప్పి వేధిస్తుంటే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్‌ చేయాలి.

⚜ తులసి ఆకులు నమలాలి.

⚜ వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలు, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి. వీలైనంతవరకు ఇంట్లో వండిన, తేలికగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని