James Cleverly: భార్యను ఎప్పుడూ కొద్దిగా మత్తులో ఉంచాలి

వివాహ బంధం దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యను ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని బ్రిటన్‌ హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ చేసిన వివాదాస్పద వ్యాఖ్య విమర్శలకు తావిస్తోంది. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని విపక్షం డిమాండ్‌ చేస్తోంది.

Updated : 25 Dec 2023 08:31 IST

బ్రిటన్‌ హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లండన్‌: వివాహ బంధం దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యను (wife) ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని బ్రిటన్‌ హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ (James Cleverly) చేసిన వివాదాస్పద వ్యాఖ్య విమర్శలకు తావిస్తోంది. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని విపక్షం డిమాండ్‌ చేస్తోంది. ఈ నెల 18న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నివాసంలో జరిగిన విందులో మహిళా అతిథులతో మంత్రి మాట్లాడినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘తన భర్తకంటే మెరుగైనవారు ఎంతోమంది ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తించకుండా భార్యకు నిరంతరం కొద్దిమోతాదులో మత్తుఇచ్చి జోకొట్టాలి. ఇది చాలాకొద్దిగా ఇవ్వడం చట్టవిరుద్ధమేమీ కాదు’ అని అన్నారు. తర్వాత దీనిపై దుమారం రేగడంతో తాను సరదాగా అలా అన్నానని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశారు. ప్రైవేటు సంభాషణలో చేసిన వ్యాఖ్యలు కేవలం జోక్‌ అని, దానికి ఆయన క్షమాపణలు చెబుతున్నారని క్లెవర్లీ ప్రతినిధి తెలిపారు. మంత్రి రాజీనామా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని